23-05-2025 02:02:23 AM
మమత సంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 22 (విజయక్రాంతి ) పేదల ముంగిటికి మోకాలు మార్పిడి చికిత్సను అందుబాటులోకి తెచ్చినట్లు, అతి తక్కువ ఖర్చుతో మోకాలు మార్పిడి చికిత్సను అందిస్తున్నామని మమత వైద్య సంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ తెలిపారు. ఇప్పటి వరకు ఆసు పత్రిలో 150 మందికి -అత్యంత విజయవంతంగా మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన ట్లు ఆమె తెలిపారు.
150 మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స -విజయవంతంగా పూర్తయిన సందర్భంగా గురువారం ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వైద్య బృందానికి జయశ్రీ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మమత వైద్య సంస్థల ద్వారా పేదలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు మమత సంస్థ ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మమత వైద్య, విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ నరేన్, డాక్టర్ సాయి శిరణి, మమత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ, మ మత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాల్, సర్జన్ డాక్టర్ బాలకృష్ణ, ఆసుపత్రి ఏవో టివి బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.