calender_icon.png 31 August, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల సర్దుబాటుకు ఆదేశాలు

31-08-2025 12:24:53 AM

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): టీచర్ల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ సర్దుబాటు ప్రక్రియ చేపట్టనుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల టీచర్ల పదోన్నతులతో పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది.

దీంతో టీచర్లు ఎక్కువగా ఉన్న చోటి నుంచి టీచర్లు తక్కువ ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. దీంతోపాటు ఇటీవల స్కూల్ అసిస్టెంట్లుగా, పీఎస్‌హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో చేరిన తర్వాత తిరిగి పాత పాఠశాలల్లో యథావిధిగా విధులు నిర్వహించాలని పలు జిల్లాల డీఈవోల నుంచి టీచర్లకు ఆదేశాలు వెళ్లడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.