calender_icon.png 31 August, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సీట్ల వ్యాపారం!

31-08-2025 12:23:47 AM

-సీట్లు డబ్బున్నోళ్లకు అమ్ముకున్నారంటూ స్టూడెంట్స్ యూనియన్స్ ఆందోళన

కుత్బుల్లాపూర్, ఆగష్టు 30(విజయ క్రాంతి):హైదరాబాద్ ప్రగతినగర్ లోని విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇస్టిట్యూట్ ఆఫ్ ఇంజ నీరింగ్ కళాశాలలో శనివారం బీ కేటగిరి సీట్ల విషయం పై పేరెంట్స్,స్టూడెంట్స్ సం ఘాలు ఆందోళన కళాశాలలో వ్యక్తం చేశా యి. రాష్ట్రంలో అత్యధికంగా ఇంజనీరింగ్ సీట్లు  దాదాపు ఫస్ట్ ఇయర్ 2500 సీట్లు ఉన్న కళాశాలలో వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఉంది.

ఈ కళాశాలలో ప్రిన్సిపాల్, మరియు డైరెక్టర్  ఇద్దరు కలిసి కొన్ని ప్రైవేట్ బ్రోకర్ కన్సల్టెన్సీ సంస్థలతో కలిసి వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు మార్కెట్లో ఉన్నటువంటి పేరును ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.మేనేజ్మెంట్, ఎన్నా రై కోట అయినటువంటి దాదాపు 680 సీట్ల ను ప్రతిభా పాటవాలు మెరిట్ తో సంబం ధం లేకుండా ఒక్కో బ్రాంచ్ కు ఒక్కో రేట్ ని ప్రకటించి సీఎస్‌ఈ, దాని అనుబంధ గ్రూ పులైతే 25 లక్షల కు గాను ఒక సీటును అలాగే ల వేరే కోర్సులు అయితే  ఒక్కో సీటుకు 15 లక్షల రూపాయల సగటున బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపించారు.

ఈ యొక్క దోపిడిని ప్రశ్నించి అర్ధరాత్రి అడ్మిషన్లు చేస్తున్నటువంటి క్రమం లో పురుషుల వసతి గృహం,మహిళా వసతి గృహం,  మేనేజ్మెంట్ కళాశాల, స్పోరట్స్ కాంప్లెక్స్ లలో ఒక గంటకు ఒక దగ్గర అడ్మిషన్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేస్తున్నారని పేరెం ట్స్, స్టూడెంట్స్, యూనియన్ నాయకులు విమర్శలు చేశారు.ఈ తతంగాన్ని  గమనించి ప్రశ్నించిన విద్యార్థి తల్లిదండ్రులను, విద్యార్థి సంఘాల నాయకులను బౌన్సర్లను అడ్డుపెట్టి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంత జరుగుతున్న కనీసం జేఎన్టీయూ అధికారులు కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ యొక్క తతంగాన్ని చూసి చూడనట్టు వదిలేస్తూ ఈ కళాశాల పైన చర్య తీసుకునేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. ఈ అక్రమాలపై  తెలంగాణ ప్రభు త్వం స్పందించి తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకుకోవాలని వారు డిమాండ్ చేశారు.

స్టూడెంట్స్ యూనియన్ ఆందోళన తెలుసుకున్న బాచుపల్లి సీఐ సతీష్ కుమార్ విద్యార్థి సంఘాల నాయకులతో, కళాశాల యాజమాన్యంతో మాట్లాడి గొడవ సద్దు మనిగేలా చేశారు. ఈ కార్యక్రమంలో  లింగం బొడ్డుపల్లి, మన అశోక్ యాదవ్, చిరంజీవి యాద వ్, రవి నాయక్, నవీన్ యాదవ్, బోరెల్లి సురేష్, కోతి విజయ్, శిగ వెంకట్, కాటం శివ, జోగు గణేష్, అందే కృష్ణ, అంబేద్కర్, సూర్యం నేరడి, మాదాసు రాహుల్ రావు, ముత్యం గౌడ్, రవి నాయక్ తదితర విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.