calender_icon.png 31 August, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి శ్వాస వరకు పోరాడిన యోధుడు సురవరం

31-08-2025 12:25:36 AM

-కమ్యూనిజం అంటే ప్రజల పక్షాన పోరాడే చైతన్యం 

-పేదల జీవితాలలో మార్పు కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం 

-సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ఖైరతాబాద్;ఆగస్టు 30 (విజయ క్రాంతి) : చివరి శ్వాస వరకు పోరాడిన కమ్యూనిస్టు  యోధుడని, కమ్యూనిజమ్ అంటే కేవలం లైబ్రరీలో చదివే పుస్తకం కాదని ప్రజల పక్షాన పోరాడే చైతన్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు అధ్యక్షతన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలు శనివారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. పేదల జీవితాలలో మార్పు రావాలని నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు.

సమాజంలో అనాగరికతను రూపుమాపేందుకు ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. మొదటి తరంలో సురవరం ప్రతాపరెడ్డి బూరుగుల రామకృష్ణ రావు పాలమూరు జిల్లాకు వన్నెతెస్తే రెండో తరంలో జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి వన్నె తెచ్చారని తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి కి మంచి గుర్తింపు వచ్చేలా మంత్రివర్గంలో చర్చించి ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. ప్రజల కోసం పోరాడిన వ్యక్తులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు.

అందుకే ఆనాడు సుధాకర్ రెడ్డి సూచనల మేరకు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు నామకరణం చేశార ని ప్రస్తుతం  మహిళా యూనివర్సిటీ కి చాక లి ఐలమ్మ పేరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కు కొండా లక్ష్మణ్ బాపూ జీ పేర్లు పెట్టడం జరిగిందని తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నిత్యం ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే అని అన్నారు. కమ్యూనిస్టులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల కమిషన్ను భాగస్వామ్యం చేసుకొని అధికారం పదిల పరిచుకోవాలని  చూస్తుందని విమర్శించా రు. అందుకోసం వారి కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించిందని విమర్శించారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కు మనమంతా ఏకమై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, మంత్రి జూపల్లి కృష్ణారావు, సిపిఎం నేత బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, గుమ్మడి నరసయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట రెడ్డి సంపత్ కుమార్, సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.