ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
03-07-2026 12:14 AM
మహబూబాబాద్, జూలై 2 (విజయక్రాంతి): కుటుంబ కలహాలు, చదువు ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో జరిగింది. పెండ్లి చందన అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఘటన సమయంలో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్ లెటర్ ప్రకారం, కుటుంబ కలహాలు, చదువు ఒత్తిడిని తట్టుకోలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






