29 April, 2026 | 3:26 AM

ప్రచారానికే వడ్డీ లేని రుణాలు పరిమితం

29-04-2026 01:09 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోంది తప్ప, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం బడంగ్పేట్ కార్పొరేషన్ కార్యాలయం లో ఆర్పీలతో  జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఐదు నెలలుగా ఆర్పీలకు వేతనాలు, సర్వే పారితోషికాలు అందడం లేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

రూ.5 లక్షల వరకు మంజూరైనట్లు చూపిస్తున్నా, వాస్తవానికి నిధులు అందడం లేదని ఆర్పీ లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసిపి యాప్ తరచూ మార్చడం వల్ల రుణాల ప్రక్రియ ఆలస్యమవుతోందని వివరించారు. సమస్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ను ఆదేశించిన ఎమ్మెల్యే, కలెక్టర్తో మాట్లాడి నిధుల విడుదల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.