calender_icon.png 20 May, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

33 కె.వి. ఇంటర్‌లింక్ విద్యుత్ లైన్ ఏర్పాటు విజయవంతం

19-05-2025 11:29:17 PM

విద్యుత్ శాఖ సూపర్ ఇండియన్ శ్రావణ్ కుమార్..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి-1 సబ్‌స్టేషన్ కాకతీయ నగర్ సబ్‌స్టేషన్ వరకు కొత్తగా నిర్మించిన 33 కె.వి. ఇంటర్‌లింక్ లైన్ సోమవారం విజయవంతంగా విద్యుదీకృతం చేయబడిందని జిల్లా విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్(Electricity Department Superintendent Engineer Shravan Kumar) తెలిపారు. ఈ లింక్ లైన్ ద్వారా నైపుణ్యతతో కూడిన విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు. కాకతీయ నగర్ కాలనీ సబ్‌స్టేషన్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు లభిస్తుందన్నారు. 33 కె.వి. చిన్న మల్లారెడ్డి లైన్ ఫీడర్‌పై భారం తగ్గుతుందన్నారు. 33 కె.వి. సబ్స్టేషన్ చిన్నమల్లారెడ్డి ఫీడర్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా మార్గం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, డిఈ కళ్యాణ చక్రవర్తి, కిరణ్ చైతన్య, ఏడిఈ ఆపరేషన్ సిబ్బంది లైన్ ను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.