calender_icon.png 20 May, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశాంతి నెలకొల్పేలా ఎంపీ, ఎమ్మెల్యే తీరు

20-05-2025 12:00:00 AM

దళిత సంఘాల నాయకులు ఆరోపణ

మంచిర్యాల, మే 19 (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మె ల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల నియోజకవర్గంలో అశాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.

సోమవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం వారు మా ట్లాడారు. కుల, మతాలు, వర్ణ విభేదాలకు అతీతంగా సోదరభావంతో జీవిస్తున్న వారి లో అశాంతి వాతావరణం నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారని, కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని వంశీకృష్ణ ఈ నియోజ కవర్గంలో రెచ్చకొట్టే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయాలని వారు సూచించారని విమ ర్శించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నియోజక వర్గములో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యమత్యంగా ఉన్నారని, అలాగే ప్రజలు సోదరభావంతో కలిసి కట్టుగా ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వాతావరణంలో కులాల వారిగా రెచ్చకొట్టి అలజడు లు సృష్టించాలని చూడడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు.

బెల్లం పల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లో ఆందోళన లు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నా రు. కేవలం స్వార్ధం కోసమే దళితులు, మా ల, మాదిగలు అంటూ విభజిస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి కాకుండా జనరల్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో నేతకాని కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్, జుమ్మిడి గోపాల్, ఎంఆర్పీఎస్ నాయకులు గోడిషాల దశరథం, బెక్కం రాజారామ్, ఐలయ్య, మల్లేష్, మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు పత్తి తిరుపతి, దళిత సంఘాల నేతలు, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిళ్ల వేణు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజా మాజీ కౌన్సిలర్ రామగిరి బానేశ్, పుదరి తిరుపతి, సల్ల మహేష్, అశోక్ తేజ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రజిత, మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత పాల్గొన్నారు.