11-10-2025 06:17:17 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక వివేకానంద డిగ్రీ & పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ మనం ఈ రోజు ఏం చేస్తాము, ఎలా జీవిస్తామో దానిపైనే మన రేపటి జీవితం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివితే మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తెలిపారు.
తదుపరి కళాశాల ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్ మాట్లాడుతూ అమ్మాయిలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, మంచి పనులు చేస్తూ తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని తెలియజేశారు. పోటీలలో గెలుపొందిన పి.తేజ శ్రీ, సాత్విక, డి.శ్రీజ, తౌసిక్ పాషాకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి మహేష్, ఎన్ శ్రీనివాస్ ఏసి ఓబి సంపత్ కుమార్, ఏవో బి. శ్రవణ్ కుమార్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.