11-10-2025 06:15:32 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో దివంగత మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆదివారం సంతాప సభలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు స్థానికంగా హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించి మాట్లాడారు.
జిల్లా అధికారులు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణు మాధవరావు, డీఎస్పీ ప్రసన్న కుమార్ ఈఈ సీతారామయ్య, డీఈ పద్మావతి, డిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ , ఎసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పోతు భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు