25-08-2025 12:15:32 AM
యాదాద్రి భువనగిరి ఆగస్టు 24 (విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ భువనగిరి జిల్లా కేంద్రంలో నేటి నుండి ఈనెల జరగనున్నాయి. రాజా నరసింహారావు ఐటీఎఫ్ జె60 అండర్ 18 బాలురు, బాలికల టోర్నమెంట్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య పర్యవేక్షణలో, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం మార్గదర్శకత్వంలో ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు.
న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీ లో నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే టోర్నమెంట్స్ కు స్థానిక ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డిసిపి ఆకాంక్ష యాదవ్ లు పాల్గొననున్నారు. ఈ టోర్నమెంట్ భువనగిరిలో జరగడం ఇది రెండోసారి అని జిల్లా టెన్నిస్ టోర్నమెంట్స్ అధ్యక్షుడు శ్రీ సద్ది వెంకట్ రెడ్డి తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అర్హులని తెలిపారు.
ఇలాంటి అంతర్జాతీయ టోర్నమెంట్లు యువతను క్రీడల వైపు, ముఖ్యంగా టెన్నిస్ వైపు ఆకర్షిస్తాయి. టెన్నిస్ భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మక క్రీడగా భావించబడుతుంది అని ఈ టోర్నమెంట్ కోసం 8 టెన్నిస్ కోర్టులు మరియు ఇతర సౌకర్యాలను ఎన్ డి టి ఏ మేనేజింగ్ డైరెక్టర్ సుబాష్ రెడ్డి పులిమామిడి కల్పించారు. టోర్నమెంట్స్ విజేతలకు ఈ నెల 30న బహుమతులు అందజేయడం జరుగుతుందని వెంకట్ రెడ్డి వివరించారు.