calender_icon.png 25 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణపై కేసీఆర్ మార్క్‌ను తుడిచేయలేరు

25-08-2025 02:16:21 AM

-బీఆర్‌ఎస్ పాలనలో వైద్యారంగానికి ప్రాధాన్యం

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణపై కేసీఆర్ మార్క్‌ను ఎవరూ తుడిచివేయలేరని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా తీసుకెళ్లారని కొనియాడారు. తమ పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేశామ ని, అందుకు నిదర్శనమే ప్రస్తుతం నిర్మాణ దశ లో ఉన్న ఆసుపత్రులని పేర్కొన్నారు. తమ ప్ర భుత్వం జిల్లాకో ప్ర భుత్వ మెడికల్ కా లేజీ కేటాయించామన్నారు.

జిల్లా, మండల కేం ద్రాల్లో కొత్త ఆసుపత్రులు, పట్టణ ప్రాంతాల్లో బ స్తీ దవాఖానలను తీసుకొచ్చామని వెల్లడించా రు.  ఒక బృహత్ ప్రణాళికతో హైదరాబాద్ నగరానికి నలువైపులా 1,000 పడకల నాలుగు టి మ్స్ ఆసుపత్రులు, వరంగల్ నగరానికే తలమానికంగా 2,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసు పత్రి, 2,000 పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తర ణ పనులు చేపట్టామన్నారు. కాంగ్రెస్ సర్కార్ ని ర్లక్ష్యం చేయకుంటే ఈపాటికే  ఆయా ఆసుపత్రులన్నీ అందుబాటులోకి వచ్చేవన్నారు. ఇప్పటికై నా  వాటిని పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.