calender_icon.png 7 May, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

07-05-2025 12:00:00 AM

  1. 27 ఆటోలు స్వాధీనం ఐదుగురి అరెస్టు
  2. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మే 6 (విజయక్రాంతి) : వివిధ ప్రాంతాల్లో ఆటోలను దొంగలించి వాటి ఇంజన్, చేసిన నంబర్లను మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహించి సమయంలో నిందితుడు ఏ3 షారుక్ పఠాన్ దొంగలించిన ఆటో (టీఎస్ 01 యూఏ 0832) తో అనుమానస్పదంగా పట్టుబడ్డాడని తెలిపారు.

అతనిని విచారించగా ఏడుగురు ముఠా సభ్యులు అందరూ కలిసి హైదరాబాద్, ఆదిలాబాద్‌లో ఆటోలను దొంగలించి వాటి వాహన నంబర్లు, ఇంజన్ నంబర్లు, చేసిస్  నంబర్లు మార్చి వాటి స్థానంలో కొత్త నఖిలీ నంబర్లు ముద్రించి అమ్మడానికి సిద్ధంగా ఉన్న సమయంలో జిల్లా పోలీసులు వారిని పట్టుకొని కేసును చేదించారని తెలిపారు.

A3 షారుక్ పఠాన్ ను విచారించగా, నిందితుడు ఏ4 అల్తాఫ్ ఖాన్, ఏ5 షేక్ ఖయ్యూం ల వద్ద 15 ఆటోలు లభ్యమయ్యాయని ఎస్పీ తెలియజేశారు. పట్టుబడ్డ వారిని విచారించగా మొత్తం 27 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఏ1 యూసఫ్, ఏ2 సయ్యద్‌లు పరారీలు ఉండగా, ఏ3 షారుక్ పఠాన్, ఏ4 అల్తాఫ్ ఖాన్, ఏ5 షేక్ ఖయ్యూం, ఏ6 అప్సర్ బేగ్, ఏ7 అసద్ ఖాన్ లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

పథకం ప్రకారం ఆటోలను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దొంగలించి వాటిని ఇక్కడికి తీసుకువచ్చి అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రధాన నిందితులను పట్టుకోవడం కోసం  జిల్లాలో ప్రత్యేక బృందం ఏర్పా టు చేసి త్వరలో వారిని పట్టుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే ఫణిధర్, సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ చంద్రశేఖర్, ఎస్త్స్ర సయ్యద్ ముజాహిద్, రూరల్ పోలీసు, సిసిఎస్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.