calender_icon.png 8 May, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు

07-05-2025 08:35:38 PM

సామూహిక కుంకుమ అర్చనలు..

కామారెడ్డి జిల్లా (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, తాడువాయి, బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, దోమకొండ, బీబిపేట మండలాల్లో, ఆయా పట్టణాల్లో, గ్రామాల్లో ఆర్యవైశ్య సోదరులు సామూహిక కుంకుమార్చన నిర్వహించడంతో పాటు వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) వాసవి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ గుప్తా కామారెడ్డిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్ల లింగం గుప్త, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి భూమేష్ గుప్తా, మోటూరి శ్రీకాంత్ గుప్తా, రాజేందర్ గుప్తా శ్రీనివాస్, కంచర్ల లింగం, మాజీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, బీబీపేటలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి వాసవి మాత జయంతి వేడుకలను నిర్వహించారు. వాసవి మాతకు పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.