07-05-2025 08:23:23 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి వేడుకలను నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సేవాసమితి వ్యవస్థాపకుడు నాగరాజు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి చేసిన కృషి మరువలేనిదన్నారు.