07-05-2025 08:28:45 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో బుధవారం ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిలువలను తనిఖీ చేశారు. పిఓఎస్ ఆధారంగా స్టాక్ బ్యాలెన్స్ ఉందా లేదా పరిశీలించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రతి రైతుకు తానకున్న ఎరువులు పురుగు మందులకు రసీదు ఇవ్వాలని సూచించారు. డీఈఓ వెంట ఏవో వెంకన్న ఉన్నారు.