07-05-2025 12:00:00 AM
వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 6(విజయక్రాంతి): బీజేపీ పార్టీ ప్రజల మద్దతు పెరుగుతుందని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు,పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. బీజేపీ ప్రభు త్వం ప్రధాన నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన 55 మంది మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాషాయం కండువా ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీకి మద్దతుగా ఉం డాలన్న ఉద్దేశ్యంలో పార్టిలో స్వచ్చందంగా చేరుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.
పార్టిలోకి చేరిన వారిలో పోల్కర్ రాము, ప్రభాకర్, సకారాం, గణపతి, మురళి తోఆటో పలువురు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లిఖార్జున్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మాటూ రి జయరాజ్, వెంకన్న, ప్రహ్లాద్, ప్రసాదౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.