13-09-2025 08:07:47 PM
కారు, రెండు తులాల బంగారు అభరణాలు స్వాధీనం
పరారీలో మరో నిందితుడు
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి
కామారెడ్డి,(విజయక్రాంతి): కారు నెంబర్ ప్లేట్ మార్చి దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు శనివారం కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కారుతో పాటు రెండు తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి అశోక్ నగర్ కాలనీ లో నివాసం ఉంటున్న మాసిరెడ్డి శివారెడ్డి ఇంట్లో గత నెల 25న ఇంటికి తాళం వేసి వేములవాడ పుణ్యక్షేత్రానికి దర్శనానికి వెళ్లి నారు.
26న ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి గేటు డోర్ తాళాలు పగలగొట్టి ఇంట్లోనే బంగారు నగలను ఎవరో గుర్తుతెలియని దొంగలు రాత్రి సమయంలో దొంగలించారని శివారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏ ఎస్ పి చైతన్య రెడ్డి పర్యవేక్షణలో కామారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రత్యేక టీము ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో శనివారం ఓ వ్యక్తి కార్లు అనుమానాస్పదంగా తిరుగుతూ తాళం వేసిన ఇండ్ల వద్ద తన కారు పరిశీలిస్తున్నాడు.
అన్న సమాచారం లాగా కామారెడ్డి పోలీస్ లు అక్కడికి వెళ్లి అనుమానాస్పద వ్యక్తిని కారును పట్టుకొని విచారించగా ఆ కారు నెంబర్ తెలంగాణతో ఉన్నది కానీ ఆ వ్యక్తి హిందీ మాత్రమే మాట్లాడుతుండగా అనుమానంతో ఆ కారు ఓనర్ వివరాలు తెలుసుకునే అతనికి ఫోన్లో మాట్లాడగా ఆ వ్యక్తి రాజస్థాన్కు చెందిన వాడని తెలిసింది. నెంబర్ ప్లేట్ మార్చి దొంగతనాలకు పాల్పడుతున్న రాజస్థాన్లోని కరోలి జిల్లా తోడబిం తాలూకా అజీజ్పూర్ గ్రామానికి చెందిన ఆన్సర్ మీనా తో పాటు అతని అనుచరుడు అభిషేక్ తో కలిసి కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగతనానికి ఉపయోగించిన కారును రెండు తులాల బంగారభరణాలను అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇద్దరు నేరస్తులు గతంలో రాజస్థాన్ రాష్ట్రంలో పాలు దొంగతనాలతో పాటు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిసింది అన్నారు తెలంగాణకు వచ్చి ఇక్కడ కూడా దొంగతనాలు చేయాలని భావించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ కేసుల ప్రధాన నిందితుడు అన్సారాజు మేనను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రెండు తులాల బంగారు బంధాలు సాధన పరుచుకొని న్యాయస్థానంలో హాజరు పరచడం జరిగిందన్నారు. మరో నిందితుడు అభిషేక్ కోసం ప్రత్యేక బంధాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక షిఫ్ట్ కారు, ఒక వివో మొబైల్ ఫోన్, ఒక తులం బంగారు చెవిపోగులు, తులం రెండు బంగారు ఉంగరాలు లభించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సీఐ నరహరి, సిసిఎస్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.