13-09-2025 08:02:24 PM
ఇంద్రవెల్లి,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ పేర్కొన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని జాలం తండా గ్రామంలో ఎంపీ పర్యటించారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. ధర్మ రక్షణ కోసం పాటుపడే పార్టీ బీజేపీ అని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు త్వరలో ప్రహరీ గోడ నిర్మిస్తామని, హనుమాన్ ఆలయం ముందర షెడ్డుతో పాటు విధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.