13-09-2025 09:59:50 PM
చేవెళ్ల: చేవెళ్ల కోర్ట్ లో ఈ నెల 8 నుండి 13 వరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 1040 కేసులు పరిష్కారించారు. ఈ మేరకు శనివారం సీనియర్ సివిల్ జడ్జి కె. దశరథ రామయ్య, జూనియర్ సివిల్ జడ్జి విజయ్ కుమార్ ఉపాధ్యాయ్, రిటైర్డ్. న్యాయమూర్తి సాంబశివరావు వివరాలు వెల్లడించారు. లోక్ అదాలత్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 553 , సిసి కాంప్రమైజ్ కేసులు 134, సిసి అడ్మిషన్స్ కేసులు 216, ఎస్ టిసి కాంప్రమైజ్ కేసులు 89, ఓ ఎస్ కేసులు 05 , బ్యాంకులకు సంబంధించి 17కేసులు పరిష్కరించామని తెలిపారు. అలాగే వివిధ కేసుల్లో రూ.24.18.300 జరిమానా విధించామని చెప్పారు.