01-08-2025 12:39:38 AM
విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ తొలి రోజే హిట్ టాక్‌ను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘విజయ్.. నీకు, నిన్ను అభిమానించే వారికి ఈ విజయం ఎంత కీలకమైందో నాకు తెలుసు. మనం హిట్ కొట్టాం’ అంటూ ఈ పోస్ట్‌లో తన ఆనందం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌పై విజయ్ స్పందిస్తూ.. ‘మనం హిట్ కొట్టాం’ అని పేర్కొంటూ హార్ట్ ఎమోజీ జోడించారు.
‘అన్నా, ఈ సారి మనం హిట్ కొడుతున్నాం’ అంటూ తన అభిమానులంతా ఆకాంక్షిస్తున్న విషయాన్ని విజయ్ సినిమా ప్రమోషన్స్‌లో ప్రస్తావించారు. అలా ‘మనం హిట్ కొడు తున్నాం’ అనే డైలాగ్ ఇటీవల ఫేమ స్ అయ్యింది. ఆ ఉద్దేశంతోనే రష్మిక ‘మనం హిట్ కొట్టాం’ అని పేర్కొన్నారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ రష్మిక.. స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనీ ప్రచారంలో జరుగుతోంది. ఈ కారణంగానే వీళ్లిద్దరి పోస్ట్‌లపై స్పందిస్తూ ఈ ఆనంద క్షణాల్లో పెళ్లి డేట్‌ను ప్రకటించేసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.