21-05-2025 12:45:07 AM
మంచు మనోజ్ పుట్టినరో జు మంగళవారం. ఈ సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నవీన్ కొల్లి తెరకెక్కిస్తున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మనోజ్ లుక్ ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. పోస్టర్‌పై కనిపించే ‘దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు’ అనే ట్యాగ్‌లైన్ కథలోని మిస్టరీని సూచిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేస్తారు.