calender_icon.png 21 May, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీరవాణి సంగీతం భావోద్వేగభరితం

21-05-2025 12:46:40 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘హరిహరవీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మాత. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా జూన్ 12న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి బుధవారం థర్డ్ సింగిల్ ‘అసుర హననం’ను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా  పవన్‌కల్యాణ్ మంగళవారం చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను సందర్శిం చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. “మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరినీ తట్టిలేపే-లా ‘సలసల మరిగే నీలోని రక్తమే...’ అంటూ పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి.

‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లనిపించింది. కీరవాణి సంగీతం కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ‘మొదటిసారి మీతో చేస్తున్నానంటే.. అంతా ఆసక్తిగా చూస్తారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియజేస్తోంది. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు” అన్నారు.