21-05-2025 12:42:54 AM
‘నా కళ్లు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతున్నాయి కబీర్.. ఇండియాలో బెస్ట్ సోల్జర్, రా లో బెస్ట్ ఏజెంట్.. నువ్వే.. కానీ ఇప్పుడు కాదు.. నీకు నా గురించి తెలీదు.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ వార్’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచాయి.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్‌తోపాటు ఇద్దరూ కలిసి చేసే పోరాటలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయనిపిస్తోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ‘వార్2’ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌లోని డైలాగ్స్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినీప్రియులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి.
హృతిక్, ఎన్టీఆర్.. ఇద్దరూ ఢీ అంటే ఢీ అనేలా పోరాట సన్నివేశాల్ని చేశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కియారా అద్వానీ ఇందులో హృతిక్ రోషన్ సరసన నటించినట్టు తెలుస్తోంది. ఆమె అందాల ఆరబోత, బికినీలో కనిపించే దృశ్యాలకు సౌందర్యారాధకులు అవాక్కవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బ్లాక్‌బస్టర్లను అందించే వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.