17-09-2025 12:50:31 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం బోట గుట్ట తండా ప్రభుత్వ పాఠశాలలో ఒకేచోట అది పక్కపక్కనే రెండు జాతీయ పతాకాలను ఆవిష్కరించడం విచిత్రంగా మారింది. బోడ గుట్ట తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు గనె యాదగిరి ఒక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, మరో జాతీయ పతాకాన్ని పీక్లా తండా పంచాయతీ కార్యదర్శి నివాస్ ఆవిష్కరించారు. పీక్ల తండా పంచాయితీకి సొంత భవనం లేకపోవడంతో పాఠశాలలోనే ఒక గదిని కేటాయించారు. దీనితో ఒకేచోట రెండు జాతీయ పతాకాలను పక్కపక్కనే ఆవిష్కరించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.