calender_icon.png 17 September, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతల ఆందోళన బాట

17-09-2025 12:34:37 PM

కొనసాగుతున్న ట్రిపుల్ ఆర్ రైతుల నిరసన..

రహదారుల దగ్బంధనంతో నిరసన తెలుపుతున్న రైతన్నలు..

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): ట్రిపుల్ ఆర్ బాధిత రైతుల నిరసన రోజు రోజుకు పెరుగుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు రహదారులు దిగ్బంధనం చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకున్న ఎకరం రెండెకరాల భూమి మొత్తం రోడ్డుకు పోతే తమకు చావే శరణ్యం అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. అలైన్మెంట్ మార్చి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సంస్థాన్ నారాయణపూర్ మండలం గుడిమాల్కాపూర్ గ్రామంలో నారాయణపూర్ చౌటుప్పల్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మూడు రోజులుగా రోజుకో గ్రామంలో రహదారులపై నిరసన తెలుపుతున్నారు. రోడ్డు దిగ్భందనంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నారాయణపూర్ ఎస్సై జగన్ నేతృత్వంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.