calender_icon.png 17 September, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా విమోచన దినోత్సవం

17-09-2025 12:39:42 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో పాత బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విమోచనం ఎంతోమంది ప్రాణత్యాగాలతో సాధ్యమైందన్నారు. భారత సైన్యం తెగింపును శ్లాఘించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 13 నెలల తర్వాత తెలంగాణకి స్వాతంత్రం వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమాజీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శంకర్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్, పట్టణ ఉపాధ్యక్షులు సల్లం సుమలత, భాష బోయిన యుగేందర్, పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్, షేక్ గౌస్ బాబా, సోషల్ మీడియా కన్వీనర్ తోటపల్లి ఓం సాయి, పుల్లె ప్రశాంత్ పాల్గొన్నారు.