17-09-2025 12:46:28 PM
పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ..
గండీడ్: అందరం ఐక్యమంగా ఉంటూ అభివృద్ధి వైపు ముందుకు సాగుదామని పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ(PACS Chairman Lakshmi Narayana) స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంపై హైదరాబాద్ సంస్థానం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనమైన రోజును కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆశన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఏవీ రాములు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలయ్య, జనార్దన్ గౌడ్, రామచంద్రరెడ్డి, సుదర్శన్ రావు, ఎంపీడీఓ హరిచందర్ రెడ్డి, భగవంత్ రెడ్డీ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.