17-09-2025 12:43:32 PM
చివ్వెంల (విజయక్రాంతి): ఈరోజు అక్కలదేవిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎక్స్ ఎంపీటీసీ గోవిందరెడ్డి అధ్యక్షాన నిర్వహించడం జరిగింది, దీనికి ముఖ్యఅతిథిగా వైవిఆర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు రైతులను నట్టేటముంచారు.. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని బుటక హామీలు అని, ఇప్పుడు యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు చూస్తున్నాం అని, బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అందరికి అండగా ఉంటడని అదైర్యాపడవద్దు అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, వెంకన్న, మంగయ్య, ఎల్లయ్య, చంద్రయ్య, లింగస్వామి, చంటి, విజయ్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.