calender_icon.png 12 October, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల వన్డే ప్రపంచకప్ ఎట్టకేలకు న్యూజిలాండ్ బోణి

11-10-2025 12:00:00 AM

గుహావటి,అక్టోబర్ 10: మహిళల వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని రుచిచూసింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన కివీస్ బంగ్లాదేశ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్  నిర్ణీత 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది.కెప్టెన్ సోఫియా డివైన్(63),బ్రూక్ హల్లీడే(69) హాఫ్ సెంచరీలతో రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో రుబియాఖాన్ 3 వికెట్లు పడగొట్టింది.

తర్వాత లక్ష్యఛేదనలో బంగ్లా ముందే చేతులెత్తేసింది. కేవలం 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ ఆరుగురు సింగిల్ డిజిట్‌స్కోర్లకే వెనుదిరిగారు. ఫాహిమా (34), రుబియాఖాన్(25) మాత్రమే పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో జెస్ కెర్ 3, తహుహు 3, మెయిర్ 2 వికెట్లు తీశారు.