06-11-2025 04:39:57 PM
ఊట్కూరి వేమన్ రెడ్డి
దేవరకొండ (విజయక్రాంతి): నేటి యువత స్వయం ఉపాధితో ఎదగాలని కొండ మల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊట్కూరి వేమన్ రెడ్డి అన్నారు. గురువారం కొండ మల్లేపల్లి పట్టణ కేంద్రంలోనీ సాగర్ రోడ్డు సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ టీ స్టాల్ ను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత ప్రైవేట్ రంగాల్లో అందివస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ నీలం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కైసర్ ఖాన్, మాజీ వార్డు సభ్యులు శంకర్ గౌడ్, కోట్ల జగదీష్, తోటపల్లి వెంకటయ్య, బచ్చనబోయిన అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.