06-11-2025 04:37:41 PM
ప్రారంభించిన సీఐ సుబ్బారెడ్డి..
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సాంబశివ దేవాలయం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పూజారి పారువెల్ల రమేష్ శర్మ ఏర్పాటుచేసిన జ్వాలాతోర్ణం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక సీఐ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దంపతులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని జ్వాలా తోరణాలు వెలిగించారు. అంతకు ముందు స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి రమేష్ శర్మ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ జ్వాలా తోరణం కార్యక్రమాన్ని భక్తుల మధ్యలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
ఈ జ్వాల తోరణలు వెలిగించడం వల్ల ఆ ఆదిదేవుడైన శివుని ఆశీస్సులతో పాటు ఆ ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సులు అందరిపై ఉంటాయని... ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఎస్సై అశోక్ రెడ్డి, ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నగునూరి అశోక్ కుమార్, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి , శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి , మాడురి ప్రసాద్, పల్లా కిషన్, పల్ల సుధాకర్, అల్లంకి నందన్న ,పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, పల్లా మహేందర్, కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్, పుల్లూరి రమేష్ , తోడుపునూరి రాజేంద్రప్రసాద్ , ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం డైరెక్టర్ సామల యమున హరికృష్ణ , బండి రామ్మోహన్ తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.