calender_icon.png 6 November, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాల ఏర్పాటు

06-11-2025 04:42:06 PM

జిల్లా సహకార అధికారి శ్రీ మాల..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం సుల్తానాబాద్ పట్టణంలోని సుగ్లంపల్లిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి డిసిఓ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిఓ శ్రీ మాల మాట్లాడుతూ గన్ని సంచుల కొడత లేకుండా చూడడం జరుగుతుందన్నారు.

కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకున్నందుకు రైతులు కూడా సహకరించాలని కోరారు. రైతులు కూడా సెంటర్ నిర్వాహలకు సహకరించాలని సూచించారు. అంతకుముందు డిసిఓ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, నాయకులు గాజుల రాజమల్లు, పన్నాల రాములు, దుగ్యాల సంతోష్ రావు, లక్ష్మీనారాయణ, శేఖర్, సీఈవో బూరుగు సంతోష్, సెంటర్ నిర్వాహకులు, రైతులు, హమాలీలు, పలువురు ఉన్నారు.