20-08-2025 01:23:45 AM
సర్వే నెం.107లో యథేచ్ఛగా వెంచర్ చేసే ప్రయత్నం
అడ్డుకొని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
చేవెళ్ల, ఆగస్టు 19:ప్రభుత్వం ఓ వైపు స ర్కారు భూములు కాపాడేందుకు చర్యలు తీ సుకుంటున్నా.. మరో వైపు అక్రమాలు ఆగ డం లేదు. ఖరీజు ఖాతా, ఫస్లీని ఆసరాగా చేసుకొని కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నించడం వెలుగులోకి వ చ్చింది. లావానీ పట్టాను పట్టాగా మార్చడ మే కాదు వెంచర్ చేసి విక్రయాలకు సిద్ధమవడం వివాదాస్పదమైంది. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ రెవెన్యూలోని స ర్వే నెం. 107లో 12.16 ఎకరాల సర్కారు భూమి ఉంది.
ఈ భూమిని కొందరు రైతు లు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ఈ మేరకు రికార్డుల్లో గ్రామానికి చెందిన మ హబూబ్ సాబ్ పేరిట సర్వే నెం. 107/అ కింద 4.39 ఎకరాలు లావానీ పట్టాగా న మోదైంది. ఇందులో 2 ఎకరాలను ప్రభు త్వం గైరాన్ సర్కారు కింద కొట్టివేసింది. మిగిలిన 2.39 ఎకరాలు మహబూబ్ సాబ్ పేరిట లావానీ పట్టాగా కొనసాగుతూ వ స్తోంది. ఈ భూమిని ఆయన వారసులు 2001లో ఇతరులకు విక్రయించారు.
లావా నీ పట్టా అమ్మినా, కొన్నా.. పీవోటీ చట్టం-1977 ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసు కోవాలి. కానీ అలా జరగకపోగా ఈ భూమితో పాటు గైరాన్ భూమిని కలిపి మొ త్తం 4.39 ఎకరాలను మహమ్మద్ జానీమియా పేరిట పట్టాగా నమోదు చేశారు. వా స్తవానికి ఈయనకు ఈ భూమితో ఎలాంటి సంబంధమే లేదు. అక్కడితో ఆగకుండా 2023 నవంబర్ 10న డాక్యుమెంట్ నెం. 3979/2023 ద్వారా ఈ 4.39 ఎకరాలను భవానీ డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విక్రయించారు.
ఖరీజు ఖాతాను ఆధారంగా చేసుకొనిమహమ్మద్ జానీమియా 2023లో సర్వే నెం. 107లోని భూమి విస్తీర్ణం, రకం, పేరు మా ర్పు కోసం కలెక్టర్కు దరఖాస్తు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో, తహసీల్దార్లు ఫస్లీలు, పహానీలు పరిశీలించి నివేదిక పం పించారు. ఈ భూమి ముందు ఖరీజు ఖాతా /సర్కారు భూమిగా ఉండగా, అనుభవదారు కాలంలో మహబూబ్ సాబ్ పేరు న మోదైంది. దీంతో 107/1 (7.16 ఎకరాలు సర్కారు), 107/అ (4.39 ఎకరాలు అసైన్డ్)గా విభజించారు.
ధరణి వచ్చాక కూడా అసైన్డ్గానే కొనసాగింది. అయితే ఖరీజు ఖాతా కావడంతో భూ యజమానులు రెవె న్యూ చెల్లింపులు చేయకపోవడంతోనే అసైన్డ్ ల్యాండ్ గా చూపబడిందని, పైసల్ పట్టీ, సే త్వార్, పహానీల అధారంగా పట్టా ల్యాండ్ అని నిర్ధారించారు. అంతే కాదు పాత రికార్డులను ఆధారంగా చూపుతూ 2.39 ఎకరా ల నుంచి 4.39 ఎకరాలకు పెంచి జానీమి యా పేరిట పట్టాగా నమోదు చేశారు.
ఈ మేరకు 2023 ఆగస్టులో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఆసరాగా చేసుకొనే భవానీ డ్రీమ్ హోమ్స్ సంస్థ ఈ భూమిని కొనుగోలు చేసింది. వాస్తవానికి ఈ భూమి పహానీలతో సహా అన్ని రికార్డుల్లోనూ సర్కారు/లావానీ పట్టాగా ఉండడం గమనార్హం. అంతేకాదు భవానీ డ్రీమ్స్ వాళ్లు కొన్నప్పు డు మహబూబ్ సాబ్ వారసులకు మార్కెట్ విలువ ప్రకారం చెక్కులు ఇచ్చినట్లు డాక్యుమెంట్లలో పేర్కొన్నప్పటికీ, వారి సంతకాలు తీసుకోలేదు. అంతేకాదు, సంబంధం లేని వ్యక్తులను కన్సల్టింగ్ పార్టీగా జోడించారు.
పలు మార్లు ఫిర్యాదు
విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాం గ్రెస్ మండల నాయకుడు భానూరి శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పలుమా ర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. గత ఆరు నెలల్లోనే జిల్లా కలెక్టర్ కు మూడు సార్లు, తహ సీల్దార్, ఆర్డీవోకు మరో మూడు సార్లు ఫిర్యాదు చేశారు.
ఈ భూమి రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి.. గ్రామ అవసరాలకు వినియోగించాలని కోరారు. లేదంటే మహబూబ్ సాబ్ వారసులకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు తహసీల్దార్ ఒకసారి ప్రీకాస్ట్ తొలగించి సూచిక బోర్డు పాతించారు. అయినప్పటికీ రెండు రోజుల కింద వెంచర్ పను లు మొదలు పెట్టారు.
దీంతో మరోసారి బాధితులతో కలిసి పనులను అడుకొని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. 4.39 ఎకరాలే కాదు, కేవలం 2 ఎకరాలు గైరాన్ సర్కారు కింద వదిలేసి మిగతా భూమినంతా పట్టాగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటం
107 సర్వే నెంబర్ కు సంబంధించిన ఇష్యూ నేను ఇక్కడికి రాకముందే జరిగింది. ప్రస్తుతం అక్కడ వెంచర్ చేస్తున్న ట్లు నా దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే సిబ్బందిని అక్కడికి వెళ్లమని ఆదేశించాం. నేను కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటం. ప్రభుత్వ భూము ల రక్షణ విషయంలో రాజీ పడేది లేదు.
గౌతమ్ కుమార్, తహసీల్దార్