calender_icon.png 9 July, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా భవన్‌లో నీటిపారుదల శాఖ ప్రజెంటేషన్

09-07-2025 06:13:22 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రజాభవన్ లో ప్రజాప్రతినిధులకు నీటిపారుదల శాఖ(Irrigation Department)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 1976లో బచావత్ ట్రైబ్యునల్ మూడు రాష్ట్రాలకు 2130 టీఎంసీలు నీటి కేటాయింపులు చేసిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయింపులు జరిగాయన్నారు. బచావత్ ట్రైబ్యునల్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండానే ఉమ్మడి ఏపీలో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, పాలమూరు-రంగారెడ్డి, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టులు చేపట్టారని గుర్తు చేశారు.

ఉమ్మడి ఏపీలో 261 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపట్టినా గత ప్రభుత్వం పూర్తి చేయాలేదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులను గత పదేళ్లలో పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేది కాదని, అల్మట్టి ప్రాజెక్టుపై ఉమ్మడి ఏపీ హయంలో సుప్రీంకోర్టులో కేసు వేశారని, బ్రిజేష్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పంపిణీ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ ప్రజెంటెషన్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరయ్యారు.