12-06-2024 12:00:00 AM
మాడభూషి శ్రీధర్ :
ఎన్నికలకు ముందు ఏర్పడే సంకీర్ణంలో ఓ నైతిక బంధం ఉంటుం ది. కానీ, ఎన్నికల తర్వాత అది ఓ తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే జరుగుతుంది. ఎన్నికలు మొదలు కావడానికి ముందు రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పార్టీలమధ్య సీట్ల పంపిణీసహా అన్ని అంశాలపై కుదిరే స్పష్టమైన ఒప్పందాన్ని ‘కూటమి’ లేదా ‘సంకీర్ణం’గా వ్యవహరిస్తారు. కూటమి సభ్యులు మొత్తం సీట్ల సంఖ్యను విడగొట్టి తమలో తాము పంచుకోవడానికి చేసుకున్న ఏర్పాటు మాత్రమే. ఇది చట్టబద్ధం కాదు. ఇందులోని ఒక రాజకీయ పార్టీ అభ్యర్థులు మరో పార్టీ అభ్యర్థులపై పోటీ చేయడానికి ఈ ఒప్పందం అనుమతించదు. ఎలాంటి సూత్రాలు, సిద్ధాంతాలు లేకుండా పూర్తిగా అవకాశవాదంగా ఏర్పడే ఈ రకమైన ఏర్పాటుకు నైతికత లేదా చట్టబద్ధమైన మద్దతు కూడా ఉండదు.
ఎన్డీఏ లేదా ఇండియా ‘కూటమి’ ఏది మనుగడలో ఉంటుందనే చర్చనీయాంశమైన రాజకీయ ప్రశ్న తలెత్తుతుంది. భారత రాజ్యాంగంలో ‘సంకీర్ణాల’ ప్రస్తావన లేదు. అందువల్ల అది రాజ్యాంగ వ్యతిరేకం కావచ్చు. రాజధర్మం లేదా ధర్మంగా పేర్కొనబడే ఈ రాజ్యాంగ పదం న్యాయ వ్యవస్థ లేదా ప్రత్యామ్నాయంగా ‘రామరాజ్యం’ లేదా ‘సుపరిపాలన’ గురించి పేర్కొనబడింది. నాటకీయంగా మారిన పార్టీ ఫిరాయింపుల (దల్ బదల్) ఫలితంగా రాజ్యాంగంలో ఓ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో రిట్లు లేదా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేశారు.
కోర్టులు ఇచ్చిన పలు రూలింగ్స్ చట్టాన్ని మరింత సంక్లిష్టం, గందరగోళం చేశాయి. ‘ఫిరాయింపుల నిరోధక చట్టం’గా పేర్కొనబడే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఎన్నికయిన పార్లమెంటు సభ్యులు ఒక ‘దళ్’ (పార్టీ)కు చెందిన వారయిన పక్షంలో ఒక పార్టీనుంచి మరో పార్టీకి ఫిరాయించడాన్ని నిషేధిస్తోంది. (ఒక రాష్ట్ర చట్టసభ లేదా పార్లమెంటుకు చెందిన (ఎ) రాజకీయ పార్టీ సభ్యులు,(బి) స్వతంత్ర సభ్యులు, (సి) నామినేటెడ్ సభ్యులు పార్టీని వీడిన సందర్భాలలో ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తమ స్థానాలను కోల్పోయే ప్రమాదం లేకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చట్టసభ సభ్యులు పార్టీలు మారడానికి అది అనుమతిస్తుంది).
కూటమి మార్పు
రాజకీయ మార్పులు, ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నప్పటికీ జరిగే ఫిరాయింపుల కారణంగా కొత్త ప్రభుత్వాలు, పార్టీలు పుట్టుకు రావడంతో రెండు లేదా కొన్ని పార్టీల కూటములు ఏర్పడాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికలకు ముందు కూటములు ‘చట్టబద్ధం’గా మారాయి. ఏదయినా ఒక పార్టీ కూటమి నుంచి విడిపోయి కేంద్రం మద్దతుతో కొత్త గ్రూపును ఏర్పాటు చేయవచ్చు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల కూటమిని నిషేధించే చట్టం ఏదీ లేదు. వారు ఏ కూటమిలోనైనా చేరవచ్చు లేదా చీల్చనూ వచ్చు. దీంతో ఒక కూటమిలోంచి మరో దానిలోకి ఫిరాయింపులు, ఫలితంగా తెల్లారేసరికి వేర్వేరు రాజకీయ గ్రూపులతో కూడిన కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. పదో షెడ్యూల్‌తో ఫిరాయింపును చట్టబద్ధంగా మాత్రమే నిరోధించడం వీలవుతుంది. కానీ ‘సంకీర్ణ’ ఫిరాయింపులను కాదు. ‘కూటమి’ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని రూపొందించే సమయం మన ఎంపీలకు లేదు. పార్లమెంటు 11వ షెడ్యూల్‌ను సృష్టించలేదా?
టీడీపీ, జనసేన, బీజేపీ బంధం
ఉదాహరణకు 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఫలితంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయింది. అయితే, ‘ఎన్నికల ముందు’ పొత్తు ముక్కలయింది. మూడు పార్టీలు పరస్పరం పోటీ పడ్డాయి. 2014లో మళ్లీ కొత్తగా ‘ఎన్నికల ముందు’ కూటమి ఏర్పడింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం సభ్యులు 135 (చంద్రబాబు నాయుడుకు చెందిన), బీజేపీ 8 (మోడీ నాయకత్వంలో), జనసేన 21 (పవన్ కళ్యాణ్ నాయకత్వంలో) గెలుపొందారు. ఈ కూటమి వైఎస్‌ఆర్‌సీపీతో పోటీ చేయగా, ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. (లోక్‌సభలో తెలుగుదేశం మొత్తం 25 స్థానాల్లో 16 చోట్ల విజయం సాధించగా, జనసేన 2, బీజేపీ ఆరు సీట్లలో పోటీ చేసి మూడు స్థానాల్లో గెలుపొందగా, వైఎస్‌ఆర్ సీపీ 4 సీట్లలో గెలుపొందింది).
కూటమిని బంధించి ఉంచేది ఏది?
అధికార కూటమిని కానీ, ‘ఇండియా’గా పిలువబడే మరో కూటమిని కానీ బంధించి ఉంచేది ఏది? ‘అవగాహనా ఒప్పందం’ ఆధారం కావచ్చు. అది స్పష్టమైన ఒప్పందం కావచ్చు. కానీ, న్యాయస్థానంలో నిలవదు. దానికి నిర్దిష్టమైన కాల పరిమితి ఉందా? ఒకవేళ ఎన్డీఏ భాగస్వాములుగా వారు మొత్తం అయిదేళ్ల చట్టపరమైన కాలపరిమితి దాకా కొనసాగితే స్థిరమైన ప్రభుత్వం ఉండవచ్చు. అధికార ఎన్డీఏ కూటమి, లేదా ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లోని భాగస్వాముల మధ్య కుదిరిన ‘అవగాహనా ఒప్పందం’ అయిదేళ్లపాటు కొనసాగుతుందా? ఒప్పందం ఉన్నప్పటికీ ‘ఈ బంధాన్ని’ పరిరక్షించడానికి ప్రధానమంత్రికి చెందిన ఎన్డీఏ కానీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కానీ ఏదయినా చర్య తీసుకున్నాయా? అన్నది ప్రస్తుతం చర్చనీ యాంశం. ఈ రెండు కూటముల్లో ఏదయినా బలహీనంగా లేదా బలంగా ఉందా? ఒకటి మితవాద కూటమి అయితే రెండోది మధ్యేవాద, వామపక్ష భావాల కూటమి. వామపక్ష భావాల కూటమి బలహీనంగా ఉందా లేక బలంగా ఉందా?
ఎన్డీఏ శక్తి
1998లో ఏర్పాటయినప్పటి నుంచి ఎన్డీఏ దేశంలో అధికారం విషయంలో గణనీయంగా వృద్ధి చెందింది. ప్రస్తుతం అది 19 రాష్ట్రాలతోపాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. ఏ కారణం చేతనైనా నాయకుణ్ణి మార్చకుంటే ప్రస్తుతం ఎన్డీఏ చైర్మన్ అమిత్ షా (కేంద్రమంత్రి) కాగా, లోక్‌సభ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ, పీయూష్ గోయల్ (కేంద్రమంత్రి) రాజ్యసభలో నాయుకుడుగా ఉంటారు. దాని తొలి చైర్మన్ అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి. 2004లో అప్పటి ఉపప్రధాని ఎల్‌కె అద్వానీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 2014 వరకు సేవలందించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 60 సీట్లను కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా జూన్ 5న నరేంద్ర మోడీ తనకు 293 మంది సభ్యుల మద్దతు ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. దీంతో మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా, తొలిసారి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ, బీహార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) ప్రధాన మిత్రపక్షాలుగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో సమతా పార్టీ, ఏఐఏడిఎంకే లాంటి పలు ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ హిందుత్వ సిద్ధాంతాన్ని పంచుకొంటున్న ఏకైక భాగస్వామి శివసేన కూ డా ఉన్నాయి. అయితే, 2019 లో కాంగ్రెస్, ఎన్‌సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడిలో చేరడం కోసం కూటమి నుంచి వైదొలగింది
. ఆ తర్వాత శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎంవీఏలో చీలికలు వచ్చాయి. బీజేపీ కుట్ర కారణంగా మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పడింది. 2003లో జనతాదళ్ (యునైటెడ్) ఏర్పడిన తర్వాత సమతా పార్టీ కూటమి నుంచి విడిపోయింది. తెలుగుదేశం పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో అటల్ బిహారీ వాజపేయి తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. కూటమి ప్రయాణంలో బీజేపీ జార్ఖండ్, ఢిల్లీలో మాత్రమే సొంతం గా అధికారంలో ఉండింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉండింది. అయితే, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణలలో ఎన్డీఏ ఎప్పుడూ అధికారంలో లేదు (అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 1999 నుంచి 2004 వరకు బీజేపీ తెలుగుదేశ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండింది).
ఇటీవలి కాలంలో రాత్రికి రాత్రి మారిన పరిణామాల కారణంగా క్షణాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. (కూటములు అంటే ఉద్వేగంతో కానీ లేదా ఎలాంటి ఆలోచన లేకుండా కానీ తీసుకునే చర్య). ఇప్పుడు కూడా కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటుకు దారితీసే ఇతర రాజకీయ పరిణామాలు సంభవించవచ్చు. ఎన్డీఏను వదిలిపెట్టి వేరే పార్టీలో లేదా ‘ఇండియా’లాంటి ఇతర కూటమిలో కానీ చేరాలంటూ ప్రధాన పార్టీల నేతలకు ఫోన్ కాల్స్ అందడం మొదలైంది. దేశ సుస్థిరతకు సంకీర్ణం మేలు చేస్తుందా లేక హాని చేస్తుందా? అయితే, ఈ విషయంలో ఏ కూటమికీ నైతిక హక్కు లేదు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు,
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్