13-06-2024 12:05:00 AM
రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో ఫీజు నియంత్రణ లేనందున అడ్మిషన్ల ముసుగులో అధికంగా దోచుకుంటున్నారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. గుర్తింపు లేని అనేక కళాశాలలు అడ్మిషన్లు తీసుకుంటున్నా, ఇంకోవైపు అకాడమీ పేర్ల తో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా ఇంటర్ అడ్మిషన్లు చేస్తున్న అకా డమీలపై క్రిమినల్ కేసులు పెట్టి, గుర్తింపు లేని కళాశాలలపై చర్య లు తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని వసతులను ఏర్పాటు చేయాలి. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం అన్యాయం.
-దుగ్యాని వెంకటేష్, పాలెం, నాగర్ కర్నూల్ జిల్లా