calender_icon.png 1 July, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఇళ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

01-07-2025 12:44:15 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 

మేడ్చల్, జూన్ 30(విజయ క్రాంతి): పేదల ఇళ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. సోమవారం బిజెపి ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు తాము గతంలో కొనుగోలు చేసుకుని రేకుల షెడ్లు వేసుకొని నివసిస్తుండగా ఇటీవల అధికారులు కూల్చివేశారని ఫిర్యాదు చేశారు.

కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇస్తారని పేద ప్రజలు భావించారని, కానీ వారు వేసుకున్న తాతకాలిక షెడ్లను కూల్చి రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. 30 గజాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు పేదలో, ధనవంతులో అర్థం కావడం లేదా మూ ర్ఖులారా అని మండిపడ్డారు. బంజారాహిల్స్ లో జీవో నెంబర్ 58,59 కింద మీ పార్టీ నాయకుల కబ్జాలో ఉన్న భూమిని ఎలా రెగ్యులరైజ్ చేస్తారని, పేదల ఇల్లు ఎలా కూలగొడతారని ప్ర శ్నించారు.

హైడ్రా కూలగొట్టింది పేదల ఇల్లేనని అన్నారు. నగరానికి నాలుగు దిక్కుల వేయాల్సిన చెత్తను ఒక్క డంపింగ్ యార్డ్ లోనే వేయడం సరికాదన్నారు. దీనిపై తమ ఆందోళన చే స్తామని ఆయన స్పష్టం చేశారు. జవహర్ నగర్ లో ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, సుభాష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి, శిల్పారెడ్డి, కార్పొరేటర్లు మహేశ్వర్ రెడ్డి, పవన్, శేషగిరి, సునీత, సురేందర్ యాదవ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.