01-07-2025 12:42:49 AM
మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్
ఘట్ కేసర్, జూన్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నది ప్రజా పాలన ప్రభుత్వం ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5లక్షలు మంజూరు చేసి ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మహోత్తర కా ర్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రా మంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ సోమవారం పలువురు నాయకులతో కలిసిశంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బీబ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ , ము న్సిపల్ కమిషనర్ బి. రాజేష్ , హౌసింగ్ బోర్డు ఏఈ అల్లాజీ, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల్ యాదవ్, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తలు సామల అమర్, సగ్గు అనీత, నాయకులు కందుల కుమార్, గాయరు విశ్వనాథం, కవాడి మాధవ రెడ్డి, బి. రాజేందర్, యుగేందర్, సొసైటీ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, డీసీసీ కార్యదర్శి ఆం జనేయులు, ఉపాధ్యక్షుడు కె. నాగరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకట్ నారాయణ, మల్లేష్ యాదవ్, నాయకులు సత్తిరెడ్డి, సల్మాన్ రాజు, కె. వెంకట్ రెడ్డి, మేకల సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.