calender_icon.png 31 December, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగారమంతా గింగిరమేసే ఏలయ్యేనా..

31-12-2025 01:27:23 AM

ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ కామెడీ చిత్రం జనవరి 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘సిన్నారి కూన..’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట ‘సిన్నారి కూన సిన్నారి కూన సిన్నంగ నవ్వే జాణా..

నీ సింగారమంతా గింగిరమేసే ఏలయ్యేనా..’ అనే పల్లవితో సాగుతోంది. ఈ పాటను జయకృష్ణ.. అప్పగింతల బ్యాక్‌డ్రాప్‌లో మెలోడీగా స్వరపరిచారు. ఈ గీతాన్ని భరద్వాజ్ గాలి రాయగా జయకృష్ణ, అనన్య భట్, ఎంజీ నరసింహ ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: సంగీతం: జై క్రిష్; డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని; డీవోపీ: దీపక్ యెరగరా.