31-12-2025 01:28:51 AM
అభిమానుల పట్ల తనకు ఎంత ప్రేమ ఉంటుందో మరోసారి చాటిచెప్పారు స్టార్ హీరో సూర్య. తాజాగా ఒక మహిళా అభిమాని వివాహ వేడుకకు సూర్య స్వయంగా హాజరు కావ టం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అరవింద్ అనే యువకుడు తన కాబోయే భార్య కాజల్‌కు ఒక అద్భు తమైన కానుక ఇవ్వాలని నిర్ణయించు కున్నాడు. కాజల్‌కు నటుడు సూర్య అంటే చాలా అభిమానం. ఆ ఇష్టాన్ని గౌరవిస్తూ, సూర్యను తన పెళ్లికి ఆహ్వానించాడు అరవింద్.
అయితే ఈ విషయం వధువుకు తెలియదు. ముందస్తు సమాచారం లేకుండా సూర్య పెళ్లి మండపంలోకి అడుగుపెట్టడంతో తన అభిమాన హీరోను చూడగానే వధువు కాజల్ షాక్‌కు గురైంది. తన కళ్ల ముందు ఉన్నది నిజంగానే తన ఫేవరెట్ హీరోనా.. కాదా? అని నమ్మలేక ఆమె నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఆనందంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. సూర్య వధూవరుల దగ్గరకు వెళ్లి, వారికి ఆశీస్సులు అందించారు.
ఇటీవల ఇలాగే మరో అభిమానిని ఆశ్చర్యపరిచారు సూర్య. సూర్య నటిస్తున్న 46వ సినిమా ప్రస్తుతం చిత్రీకణ జరుగుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమం సందర్భంగా సూర్య తన కోస్టార్ చరణ్ కుమారుడు చర్విక్‌కు గోల్డ్‌చైన్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ చిన్నారిని కొద్దిసేపు ఎత్తుకుని ముద్దు చేశాడు. అయితే, నటుడు చరణ్.. హీరో సూర్యకు వీరాభిమాని. ప్రస్తుతం ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అభిమానుల పట్ల చూపిస్తున్న సూర్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.