31-12-2025 01:25:52 AM
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) కన్నుమూశారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలు, పక్షవాతంతో బాధపడుతున్న శాంతకుమారి మంగళవారం కొచ్చి లోని ఎలమక్కరలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శాంతకుమారి మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని మోహన్‌లాల్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దాదాసాహెబ్ ఫాల్యే అవార్డు వచ్చిన సమయంలోనూ మొదట తల్లి సమక్షంలోనే ఆనందాన్ని పంచుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మోహన్‌లాల్. శాంతకుమారి భర్త, మోహన్‌లాల్ తండ్రి దివంగత విశ్వనాథన్ నాయర్ కేరళ ప్రభుత్వ మాజీ లా సెక్రెటరీగా పనిచేశారు. శాంతకుమారి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు.