calender_icon.png 5 July, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమస్ఫూర్తి రగిలేనా!

24-04-2025 12:00:00 AM

మహాభారతంలోని విరాటపర్వంలో గోగ్రహణం అనే ఘ ట్టం ప్రధానమైందే. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు విరాటరాజు కొలువులో ఉ న్నారన్న అనుమానంతో వారి ఆచూకీ తె లుసుకోవడానికి ఆ రాజు గోవుల మంద ను తరలించుకు పోతారు కౌరవులు. అక్కడే పాండవులుంటే తప్పకుండా వస్తారని, వాళ్ళను గుర్తించవచ్చునని భావిస్తా రు. మారువేషంలో ఉన్న అర్జునుడు గోవుల మందను మలుపుకు పోవడానికి వచ్చాడు.

ఈ నపుంసకుడా మమ్ములను ఎదిరించేదని నవ్వుతారు కౌరవులు. అప్పు డు భీష్ముడు అంటాడుె “దుర్యోధనా! వ చ్చింది ఎవరోకాదు అర్జునుడు. అతన్ని గెలవడం సాధ్యం కాదు”. ఆ మాటలు విన్న దుర్యోధనుడు, “పాండవులు అజ్ఞాతవాసం ముగియక ముందే దొరికారు కాబ ట్టి, మళ్లీ అరణ్య, అజ్ఞాతవాసాలు చేయా లి” అంటాడు.  అప్పుడు భీష్ముడు  తిథు లు, సమయాలు లెక్కించి “ఆ గడవు కొద్ది ఘడియల క్రితమే ముగిసింది” అంటాడు.

బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు విరాటరాజు గోవులను మలుపుకొని వెళ్ళిపోతాడు. ఈ ఘట్టం నుంచే ‘ఆవుల మలి పిన వాడే అర్జునుడు’ అనే సామెత మన తెలంగాణలో పుట్టింది. ఇది సరిగ్గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వర్తి స్తుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు. ‘ఆవుల మంద మలిపిన వా డే అర్జునుడైతే’ తెలంగాణను సాధించి పె ట్టింది కూ డా కేసీఆరే.

మహాభారత యు ద్ధంలో అనేక శస్త్రాలు, సైన్యం ఉన్నా ప్రధాన శత్రువులను అందరినీ హతమార్చింది అర్జును డే. అయితే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రోద్యమంలో ఎందరో మహానుభావులు ఉన్నా, ప్రజాబలమున్న నేతలు ఎందరు ఎదురైనా, కఠోర సమస్యలను అన్నింటినీ సు నాయాసంగా పరిష్కరించి, రాజకీయ చతురతతో, గొప్ప వ్యూహంతో తెలంగాణ వ్యతిరేకులను మట్టి కరిపించి ప్రత్యేక తెలంగాణను సాధించారాయన. 

సెంటిమెంట్ వాస్తవం

కేసీఆర్ పాత్ర ‘మహాభారత యుద్ధం’ లో అర్జుని పాత్ర వంటిదే. అర్జునుడు లే కుండా భారతం లేనట్టే, కేసీఆర్ లేకుండా తెలంగాణ ప్రస్తావన ఉండదు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీ స్థాపించక ముందు నుంచే ప్రజలలో ఆ భావన ఒక కలగా మాత్రమే ఉండేది. ‘రాజకీయ పార్టీ లేకుండా రాష్ట్ర సాధన అసంభవం’ అన్న వాస్తవం బయటపడిం ది.

అప్పటికే తెలుగుదేశం పార్టీలో ఇమడ లేక 2001లో కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ స్థాపించిన తర్వాత దానికో రాజకీయ రూపం ఏర్పడింది. 1970 నాటి ‘తెలంగాణ ప్రజా సమితి’ పార్టీకి భిన్నమైన నాయకత్వం అందించడం, పాతుకు పో యిన వలసవాదులు, తెలంగాణ వ్యతిరేకులను, రాష్ట్ర ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను అధిగమించి రాష్ట్రాన్ని సాధించడం సామాన్యమైన పని కాదు.

ఓ బక్క చిక్కిన మనిషి ఇవన్నీ అధిగమించి తెలంగాణ సాధిస్తాడని ఎవరూ అనుకోలేదు. గల్లీనుంచి ఢిల్లీ వరకు నలుచెరుగుల ఉద్యమాన్ని వ్యాపింపచేసి ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చు డో’ అని నినదించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేశారు.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రోద్యమ పగ్గాలు చేబట్టి ఉండకపొతే రాష్ట్ర ఏర్పాటు కలగానే ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు అవునన్నా, కాదన్నా నాడు రాష్ట్ర సాధనలో తెలంగాణ సెంటిమెంట్ ప్రతి వ్యక్తినీ కదిలించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్ర భుత్వాన్ని ఏర్పరచి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో మొదటి దఫా పాలనను అందించారు కేసీఆర్. తెలంగాణ ప్రజల మన్ననలు పొందిన కారణంగా ప్రజలు ఆయనకే రెండవ దఫా అఖండ విజయాన్ని అందించారు. రైతు బాంధవునిగా, ‘నీళ్లు, నిధులు, నియామకాల సాధన’ నినాద లక్ష్యం ఇంకా నెరవేరకుండానే, దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ ను చూసి పొంగిపోయారు.

తన ఇంటెలిజెన్సీ వైఫల్యంతో, వెన్నుదన్నుగా నిలిచిన ఈటెల రాజేందర్‌పై అప్రకటిత యుద్ధం ప్రకటించారు. ఆ ‘ఒక్కడి’ని ఓడించేందుకు తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల గ్రాంట్ అందించే ‘దళితబంధు’ పథకం నియోజక వర్గంలో ప్రారం భించారు.

ఇది పరోక్షంగా కులవృత్తులు, చేతివృత్తుల మీద ఆధార పడిన వర్గాలను దూరం చేసింది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దూకుడును నివారించగల పార్టీ టిఆర్‌ఎస్ మాత్రమేనని నమ్మారు. 

ఎందుకు విఫలమైనట్టు? 

పార్టీ 21వ వ్యవస్థాపక దినోత్సవం సం దర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వి రుద్ధంగా, గొప్పలకు పోయారు. తదుపరి ప్రత్యామ్నాయంగా నిలుస్తామని ‘భారత రాష్ట్ర సమితి’గా టీఆరెస్‌కు నామకరణం చేసి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకు వచ్చారు. దేశ రాజకీ యాల్లో గరిట తిప్పాలనీ నిర్ణయించారు. ప్రత్యర్థులుగా ఉన్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇది మింగుడు పడలేదు.

2001లో కరీంనగర్‌లో జరిగిన సిం హగర్జనకు కాన్వాయి కదిలినట్టే అదే తరహాలో 600 పైచిలుకు కార్లతో మహాయాత్ర ఓ అద్వితీయ దృశ్యం. ప్రత్యర్థులు తట్టుకోలేదు, నోట్లో నాని పోయా రు. అప్పటికే బీజేపీ నాయకులు షిండే వస్తారని సన్నాయినొక్కులు నొక్కారు. నా లుగు కోట్ల ప్రజల మన్ననలు పొందుతు న్న భూమిపుత్ర పార్టీని ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చి కష్టాలను కొనితెచ్చుకుంది. 

రెండవ దఫా రాష్ట్రంలో పెరిగిన ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి, అహంకారం అరికట్టడంలో పెద్ద ఎత్తున విఫలమయ్యా రు. కనీసం టికెట్ల పంపిణీలో రాజకీయ చాణక్యత ప్రదర్శిస్తారనీ భావించారు కానీ, రేవంత్ ట్రాప్‌లో పడి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి తన గొయ్యి తానే తవ్వుకున్నారంటే అతిశయోక్తి కాదు. నాడు మలిదశ తెలంగాణ ఉద్యమం ఆరంభంలో నాలుగు కోట్ల ప్రజ ల ఆకాంక్ష ఉన్నది.

అందుకే విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు రంగంలోకి దిగారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యూహంలో 100 మంది పీకేలు పనికి వచ్చేవారు కాదు కదా? 25 సంవత్సరాల కింద బక్క మనిషికి ఉన్న క్రేజీ వేరు, అధికారంలో ఉన్నన్ని నాళ్లు ప్రజల మధ్య లేకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారానికి దూరం కావడం జీర్ణించుకోలేక పోతున్న బీఆర్‌ఎస్ తన తప్పిదాలను సరి చేసుకోకుండా రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందనే లీకులు పార్టీ లో అలజడికి కారణం అవుతున్నది. 

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి!

‘వచ్చేది మన ప్రభుత్వం’ అంటూ పీకల దాక లిక్కర్ కేసుల్లో ఇరికిన తనయ కవిత, తనయుడు కేటీఆర్ అన్నీ తానై నడిపించినా ప్రయోజనం ఉండదనే విష యం గుర్తెరగాలి. ఇప్పటికీ కేసీఆర్ అంటే నమ్మకం, బాధ్యత. అందుకే, “ఉద్యమనేత బాహ్య ప్రపంచంలోకి ఎప్పుడు వస్తారు? ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవుతారా? అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? ప్రజలమధ్యకు రారా?” అంటూ అధికార పార్టీ ఒకవైపు, బీజేపీ ఎత్తి పొడుపులు మరోవైపు మాములుగా లేవు కదా! తెలంగాణ ప్రజలు విజ్ఞులు. డేగకళ్లతో గమనిస్తున్నారు.

ఉద్యమ నాయకుడిగా ఏం చెప్పినా విన్నారు కానీ, మహాభారతంలో ఆవులు మలిపిన అర్జునుడిలా మళ్ళీ మొదలెట్టాలి. అధికార పార్టీ ఇప్పటికే అప్పులని, అక్రమాలని అనేక ప్రశ్నలు సంధించింది. 16 నెలల పాలన పూర్తయిన కేసీఆర్ పాలనను వేలెత్తకుండా ఉండడం లేదు. దానికి సమాధానం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వర్ణోత్సవ సభలో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛేదించి 10 లక్షల మందితో జన సమీకరణ చేస్తామని ఉవ్విళ్లూరుతోంది. సభ విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. 

ఎక్కడ గౌరవం పోగొట్టుకున్నారో అక్క డినుంచే దానిని సంపాదించుకోవడం కోసం ఉద్యమం మొదలెట్టాలనే ఆకాంక్ష ఉద్యమనేతలో స్పష్టంగా కన్పిస్తున్నది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమవాదిగా జెండా ఎత్తి, మళ్ళీ రగిలించడమన్నది అంత సుల భం కాదు. భూమిపుత్ర పార్టీగా హేళన ఎల్లకాలం ఉండదు. చెల్లా చెదురయిన క్యేడర్‌కు  జవాబు దొరుకుతుందని ‘స్వర్ణోత్సవ సభ’ సందర్భంగా సమరోత్సా హంతో ఎదురు చూస్తున్నారు.

వ్యాసకర్త సెల్: 9866255355