24-04-2025 12:00:00 AM
మానవ చరిత్రను గమనిస్తే గతంలో ప్రజలు ఎక్కువగా చిన్న సమాజాలుగానే నివసించారు. ఇటీవలి కాల- పరిణామాలు నాటకీయంగా మారిపోయాయి. పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే జనాభాను ఒకసారి గమనిద్దాం. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా ప్ర జలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
ఇందులో చాలామంది పట్టణ మురికివాడల్లోనే జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాలుగా మురికివాడలను పేర్కొనవ చ్చు. ఈ ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, విద్యుత్ సరఫరా వంటి సేవలు కావాల్సిన మేరకు వారికి అందుబాటులో ఉండవు. వాస్తవానికి ఇక్కడి ప్రజలు నాణ్యమైన పక్కా ఇళ్లల్లో కాకుండా పూరి గుడిసెల్లో నివాసం ఉంటారు.
ఉపాధి కేంద్రాలుగా నగరాలు
పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన ప్ర జలు కాలుష్య కోరల్లో దుర్భర జీవనాన్ని గుడుపుతున్నారు. ఈ తరుణంలో నగరాలను ఉపాధి కేంద్రాలుగా భావించి సంబ ర పడాలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజలకు మెరుగైన జీవన అందించాలంటే ఉపాధి అవకాశాలను కేవలం ఒకే దగ్గర కేంద్రీకరించకుండా వాటిని ఇతర ప్రాంతాలకు విస్తరింప చేయాల్సిన అవసరం ఉంది.
గడిచిన దశాబ్ద కాలంలో దేశంలోని పట్టణీకరణ రేటును గమనిస్తే, పట్టణ గ్రామీణ నిష్పత్తి 80: 20కి చేరుకోవడానికి రెండు శతాబ్దాల కాలం పట్టే అవకాశం ఉంది. 1971 1981 మధ్య సుమారు 93 లక్షలమంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లినట్టు గణాంకాలు చెబుతున్నా యి. అలాగే, 1981 మధ్య 106 లక్షల మంది, 1991 మధ్య 142 ల క్షలమంది పట్టణాల బాట పట్టారు.
ఈ వ లసలతో నగరాలు క్రిక్కిరిసి పోతున్నాయి. దీనివల్ల ఆయా నగర ప్రాంతాలలో వలసలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు మెరుగు పర్చాల్సి ఉంది. ఒకవేళ ఉపాధి అవకాశాలను మెరుగు పర్చకుంటే ప్రాం తాల మధ్య అసమానతలు, అంతరాలు ఏర్పడుతుంది. ఇది తీవ్రరూపం దాలిస్తే పరిస్థితి ఉద్యమాలకు దారితీస్తుంది.
సంక్షోభం మితిమీరక ముందే..
ప్రపంచంలోని అనేక ప్రాంతాలుసహా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు విడి పోవడానికి ఈ అంతరాలే కారణమనే విషయా న్ని మనం మర్చిపోకూడదు. నగరాల్లోనే పరిశ్రమలను స్థాపించడం, సమీప ప్రాం తాల్లోనే కాలుష్యంతో కొట్టు మిట్టాడుతూ వలసదారులు జీవనం గడపటం, ప్రాంతా లు, భాషలు, అవకాశాలు, వనరుల అభివృద్ధిలో అసమతుల్యత వంటివాటి కార ణంగా ప్రజా పోరాటాలు జరగటం మనం చూస్తూనే ఉన్నాం.
విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలను కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయడానికి బదులుగా గ్రామీ ణ ప్రాంతాలకూ విస్తరించాలి. అప్పుడు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి ప్రజలు ఆసక్తి చూపే అవకాశమూ ఉండదు కదా. పాలకులు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను గమనిస్తే పట్టణ ప్రాంతాల కు పెద్ద మొత్తంలో, గ్రామీణ ప్రాంతాలకు మాత్రం నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
ఈ వైఖరి ఇలాగే కొనసాగితే పాలకులపై గ్రామీణ ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి రావచ్చు కూడా. అందువల్ల అన్ని ప్రాంతాలకు స మాన అవకాశాలు కల్పించేలా వనరులు, అభివృద్ధి అవకాశాలను మెరుగు పరచాల్సిన బాధ్యత పాలకులదే. అలాగే, ప్రకృతి సంక్షోభాలకు మూలంగా పట్టణ ప్రాంతాలను గుర్తించవలసి ఉంటుంది.
అనేక పరిశ్రమలు జనావాసాలకు దగ్గరగా ఉన్న కారణంగా రకరకాల కారణాల తో ఇప్పటికే లక్షలాదిమంది ప్రజలు ప్రా ణాలు కోల్పోయారు. ఇటువంటి తరుణం లో గ్రామీణ ప్రాంతాలను కూడా అభివృద్ధి పరచాలనే ఆలోచన పాలకుల్లో రావాలి. లేకపోతే వారి భవిష్యత్తు అంధకారంగా మారడం ఖాయం. ఇప్పటికైనా పాలకులు పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి.
వలసల నివారణకు మార్గాలు
మౌలిక సదుపాయాలు అవసరమైన మేరకు లేని కారణంగా నగర జీవితం దు ర్భరమవుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం. 1950 ప్రాంతంలో ఢిల్లీ జనాభా 13.7 లక్షలు. 2024 నాటికి ఈ సంఖ్య మూడు కోట్లు దాటింది. 1950ల్లో ముంబైలో 30.9 లక్షల జనాభా ఉండగా ఇప్పుడు రెండు కోట్లకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు లక్షల్లో ఉన్న జనాభా ఇప్పుడు కోట్లకు చేరడానికి గల కారణం అభివృద్ధి పట్టణాలకు పరిమితం కావడమే.
ఈ పరిస్థితి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ దేశాలను గమని స్తే కూడా మనకు ఇదే కనిపిస్తుంది. ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రజలు తిరగబడటానికి ముందే పాలకులు మేల్కొనా ల్సి ఉంది. నగరాల్లో వలస జనాభాను తగ్గించడానికి ప్రజలు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో భూమితో పాటు ఇతర మౌలిక సదుపాయాలు విస్తృతంగా లభిస్తాయి.
అందువల్ల అక్కడ పరి శ్రమలు, సంస్థలను నెలకొల్పడం ద్వారా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరుతుంది. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని కేంద్రీకరించడం ద్వారా భారీ స్థాయిలో సంపదను సృష్టించవచ్చు. దానిని తిరిగి ప్రజలకు పంచడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన కృషి ఇప్పటి నుంచి ఒక పదేళ్లలో జరపాల్సిన అవసరం ఉంది. లేకపోతే పట్టణ ప్రాంతాల్లో జనా భా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది.
వసతుల కల్పన పెద్ద సవాలు
ఇటీవల ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆర్థిక, సామాజిక సంబంధాల విభాగం కొ న్ని గణాంకాలను వెలువర్చింది. 2035 నాటికి పట్టణాల్లో భారీ స్థాయిలో జనాభా విస్పోటం జరుగుతుందని అందులో పే ర్కొంది. వచ్చే పదేళ్లలో మహానగరాల జనాభా ఢిల్లీలో 4.33 కోట్లకు, ముంబైలో 2.73 కోట్లకు చేరుకుంటుంది.
ఇంత భారీ మొత్తంలో పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరిగిపోతే మౌలిక సదుపాయాల కల్పనలో సమస్యలు స్థానిక పాలనా సంస్థలకు తలకుమించిన భారమవుతుంది. ఇప్పటికే ఆయా నగరాలలో కనీస ప్రాథమిక అవసరాలు తీరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ఈ దురవస్థలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మురికివాడల సంఖ్య కూడా అపరిమితంగా పెరిగిపోతుంది.
ఇతర దేశాలను పక్కన పెడితే భారతదేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. భూమి ఇతర సౌకర్యాలు ఉన్నందు న గ్రామీణ ప్రాంతాలే కేంద్రంగా అభివృ ద్ధి ఫలాలను అందించడానికి ప్రభుత్వా లు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి.
మన ప్ర ణాళికలు, ఆచరణ, వ్యూహాలను గ్రామీ ణ ప్రాంతాలకు, మధ్యతరగతి పట్టణాలకు వి స్తరింప చేయాలి. సాగుతో ముడిపడి ఉన్న పనులు కూడా దొరక్క పోవడంతో పెద్ద ఎ త్తున ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వె ళ్తున్నారు. ఈ వలసల ప్రవాహాన్ని తక్షణం నిలువరించాల్సిన బాధ్యత అందరిదీను.