calender_icon.png 22 November, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయంలో రాజకీయాలు తగునా?

22-11-2025 12:00:00 AM

అధికారం పదవులు శాశ్వతం కావు  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి 

 నకిరేకల్, నవంబర్21 (విజయక్రాంతి): దేవాలయంలో రాజకీయాలు చేయడం  ఎంతవరకు సమంజసం అని అధికారం, పదవులు ఎన్నటికీ శాశ్వతం కావని, మనుషుల పట్ల గౌరవమే శాశ్వతమన్న నిజాన్ని గ్రహించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివ స్వాముల 20వ మండల పడిపూజ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ లో రెండు సార్లు ఎమ్మెల్యేగా సేవలు చేసిన తన పేరును కరపత్రంలో చేర్చకపోవడం బాధాకరమన్నారు.

దేవాలయం వంటి పవిత్ర స్థలంలో  రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత దిగజారి ప్రవరిస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తన పదవీకాలంలో ప్రతి ఒక్కరిని గౌరవించానని, హుందాగా వ్యవహరించానని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పడిపూజ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేకుండా హుకుం జారీ చేసి పైశాచిక ఆనందం పొందడం తప్ప మరోటి కాదన్నారు. పడిపూజ కార్యక్రమం విషయం స్థానిక నాయకుల ద్వారా తెలిసుకొని దైవభావంతో, భక్తిశ్రద్ధతో స్వయంగా దేవాలయానికి వచ్చానన్నారు.

ప్రజా జీవితంలో ఇలాంటి వ్యవహారాలు మంచి సంస్కృతి కావని. సమాజానికి కూడా మంచి సందేశం ఇవ్వవన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాల దిశగా ఆలోచించడం, గౌరవ విలువలు పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో హుందాతనం, పరస్పర గౌరవం, సంస్కారం చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో   నకిరేకల్  మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్  , మాజీ జెడ్పిటిసి తరాల బలరాం, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, నాయకులు పెండెం సదానందం, గొర్ల వీరయ్య, రావిరాల మల్లయ్య, రాచకొండ వెంకన్న, పల్లె విజయ్, యానాల లింగారెడ్డి, కొండ వినయ్, గుర్రం గణేష్ , శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు.