calender_icon.png 22 November, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా పాఠశాల విద్యార్థినికి పాముకాటు

22-11-2025 12:01:42 AM

హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు 

ప్రాణాపాయం లేదన్న వైద్యులు 

కామారెడ్డి జిల్లా రాజంపేట కేజీవీబీలో ఘటన 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట కస్తూర్బా పాఠశాల విద్యార్థిని శుక్రవారం పాముకాటు వేసింది. వెంటనే విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్ సమాచారం అందించడంతో వెంటనే పాముకాటుకు గురైన విద్యార్థినిన్ని హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసినా వైద్యులు విద్యార్థినికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కస్తూర్బా పాఠశాలలో తరచుగా పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కస్తూబా పాఠశాల చుట్టూ శుభ్రం చేయాలని విద్యార్థులు తెలిపారు. కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పరీక్షల విభాగం అధికారులు నీలం లింగం, మండల విద్యాశాఖ అధికారి సందర్శించారు. విద్యార్థినిలు భయపడవద్దని అధికారులు సూచించారు.