22-11-2025 12:26:05 AM
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య
కామారెడ్డి,(విజయక్రాంతి): జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కిష్టయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని, మేధావులు శాస్త్రవేత్తలు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉన్నాయని నేడు ఆధునికంగా వచ్చిన డిజిటల్ లైబ్రరీలు ద్వారా ప్రపంచం మొత్తాన్ని చదవచ్చన్నారు.
విద్యార్థులు కళాశాల గ్రంధాలయాన్ని వినియోగించుకొని వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉన్నత ఉద్యోగాలు పొందాలని అన్నారు. కళాశాల గ్రంథపాలకులు డాక్టర్.దినకర్ చిన్న మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు, కళాశాలలో వారం పాటు పుస్తక ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధిపతులు, సమన్వయకర్తలు డాక్టర్. విశ్వప్రసాద్, అంకం జయప్రకాష్, ఏవో జగన్మోహన్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, గ్రంథాలయ సహాయకులు మారుతి, రాములు, మానస, శ్రీవల్లి, రాజశ్రీ, శారద, రాజేందర్, డాక్టర్. రాజగంభీర్ రావు,స్వాతి , వెన్నెల, బాలాజీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.