calender_icon.png 22 November, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడబలిజ సంఘం జెండా ఎగరవేసిన రాష్ట్ర అధ్యక్షులు దామోదర్

22-11-2025 12:30:11 AM

వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): మండల పరిధిలోని మొర్రవానిగూడెం గ్రామంలో వాడబలిజ సేవా సంఘం జెండాను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్రా దామోదర్ ఎగరవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం మొదలైందని అన్నారు. కనుక ఉద్యమం ఉవ్వెత్తున చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని తెలియజేశారు. ప్రభుత్వాలు 42% బీసీలకు కేటాయించి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ మాకు ఈ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉండడం వలన 42% కాదు కదా 100% ఇచ్చినప్పటికి కూడా మాకు అన్యాయం జరుగుతుందన్నారు.

కావున బిసి కులాలందరూ కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, లేనియెడల బీసీలను అణగదొక్కే ప్రయత్నం ప్రభుత్వాలు, పాలకులు చేస్తున్నారని ఉదాహరణకి సాంప్రదాయ, సాంప్రదాయ మత్స్యకారులమైన వాడ బలిజలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో వేసే చాప పిల్లలపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

వాడబలిజ కులస్తులు ఈ ప్రాంతానికి వలస వచ్చిన వారు కాదని, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి వందలాది సంవత్సరాలుగా మా తాత ముత్తాతల కాలం నుండి ఈ ప్రాంతంలో ఉన్నామని, ఇప్పుడు ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ రాక ముందు నుంచి మేము ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నామని, ఇప్పుడు కొన్ని చట్టాల వలన  ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని తెలియజేశారు. మనం కలిసికట్టుగా ఉన్నట్లయితే ప్రభుత్వాలు పాలకులు దిగివచ్చి మనకు హక్కులు కల్పించే అవకాశం ఉందని తెలియజేశారు.