calender_icon.png 22 November, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజులకు అధిక సీట్లను కేటాయించాలి

22-11-2025 12:22:31 AM

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పున్న రాజేశ్వర్

కామారెడ్డి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పున్న రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో ముదిరాజుల జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు పున్న రాజేశ్వర్ మాట్లాడుతూ... జనాభా ప్రాతిపాదికంగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆర్థికంగా ముదిరాజులు ఎదగాలని, స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జెలు బిక్షపతి మాట్లాడుతూ... ముదిరాజులకు అన్ని గ్రామాలలో  మత్స్యకార సహకార సంఘాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వాటిలో ముదిరాజులకు సభ్యత్వాలు కల్పించాలని కోరారు. ముదిరాజులను బిసి-డి నుంచి ఏకు వెంటనే మార్చి ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం అందులో ముదిరాజులకు ప్రత్యేక స్థానం ఉండడం అభినందనీయం అన్నారు.