calender_icon.png 22 November, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవికి మరో షాక్

22-11-2025 12:23:22 AM

  1. మిగతా 4 కేసుల్లోనూ అరెస్ట్‌కు రంగం సిద్ధం
  2. నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
  3. కొనసాగిన రెండో రోజు విచారణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు భారీ షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక కేసులో అరెస్ట్ చేసి, ఐదు రోజుల కస్టడీలో విచారిస్తున్న పోలీసులు.. అతడిపై నమోదైన మిగిలిన నాలుగు కేసుల్లోనూ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా, పోలీసులు తాజాగా నాంపల్లి కోర్టులో పీటీ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేశారు.

తొలుత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ కేసులో అతడిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, అతడి పైరసీ కార్యకలాపాల వల్ల నష్టపోయిన పలువురు సినీ నిర్మాతలు కూడా వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో, మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటికి అదనంగా, పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వ్యవహారంలోనూ రవిపై మరో కేసు ఉంది.

ఈ అన్ని కేసుల్లోనూ అతడిని అధికారికంగా అరెస్ట్ చేసి, ఈ మొత్తం పైరసీ నెట్‌వర్క్‌ను సమూలంగా ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఐదు రోజుల పోలీస్ కస్టడీ లో భాగంగా శుక్రవారం రెండో రోజు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు రవిని లోతుగా విచారించారు.

ఈ పైరసీ కార్యకలాపాలకు ఎవరు సహకరించారు? అతని వెనుక సినీ పరిశ్రమకు చెందిన లేదా ఇతర రంగాలకు చెందిన కీలక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేదా మొత్తం వ్యవహారాన్ని ఒంటరిగానే నడిపాడా? ఈ నెట్‌వర్క్‌కు సాంకేతిక సహకారం అందించిన వ్యక్తులు ఎవరు? వంటి కోణా ల్లో అధికారులు కీలక వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారని తెలిసింది.

తొలి రోజు కస్టడీలో పైరసీ ద్వారా వచ్చే ఆదాయం, నెట్‌వర్క్ సోర్స్, సర్వర్ల నిర్వహణ వంటి సాంకే తిక అంశాలపై పోలీసులు వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. రెండో రోజు విచారణలో ఈ నేరంలో భాగస్వాములైన ఇతరుల వివరాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కస్టడీ పూర్తయ్యేలోగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.